అత్యంత పుణ్యప్రదమైన మాసాలలో ‘వైశాఖ మాసం’ ఒకటిగా హిందూ ధర్మం చెప్తూంటుంది. ఈ మాసంలో చేసే ఒక్కో దానం ఒక్కో విశేషమైన ఫలితాన్ని ఇస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు,పురాణాల ఉవాచ. అందువల్లనే ఈ మాసంలో అన్నదానం .. వస్త్రదానం .. గొడుగు – పాదరక్షలు .. మంచినీళ్లు దానం చేస్తుంటారు. ముఖ్యంగా ఈ కాలంలో కాసే మామిడి పండ్లను కూడా దానం చేస్తుంటారు.

వైశాఖ మాసంలో ఏవి దానం చేస్తే ఏం ఫలితం కలుగుతుంది?
మామిడిపళ్ళు పితృదేవతలు సంతోషిస్తారు, పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది.
పానకం కుండ పితృదేవతలకు వంద సార్లు గయలో శ్రాద్ధం పెట్టిన పుణ్యఫలం దక్కుతుంది.
దోస, బెల్లం, చెరుకు సర్వపాపాలు నశిస్తాయి.
మంచం సుఖసంతోషాలు అభివృద్ధి చెందుతాయి.
వస్త్రాలు ఆయుష్షు వృద్ధి, ముఖ్యంగా తెల్లవస్త్రాన్ని దానం చేస్తే పూర్ణాయుష్షు పొంది అంత్యంలో ముక్తిని పొందుతారు.
కుంకుమ స్త్రీలకు పూర్ణ ఆయుష్షు కలిగిన భర్త లభిస్తాడు, ఉన్నత స్థానాలకు చేరుకుంటారు.
గంధం తరచుగా ప్రమాదాలకు గురికాకుండా తప్పించుకోగలరు
తాంబూలం అధిపతులు అవుతారు.
కొబ్బరికాయ ఏడు తరాల పితృదేవతలను నరకభాదల నుండి విముక్తులను చేస్తారు
మజ్జిగ సరస్వతీదేవి అనుగ్రహంతో విద్యాప్రాప్తి కలుగుతుంది.
చెప్పులు నరకబాధల నుండి విముక్తి లభిస్తుంది.
గొడుగు సమస్త దోషాలు నివారింపబడతాయి, కష్టాల నుండి విముక్తి పొందుతారు, మృత్యుబాధ ఉండదు.
ఫలాలు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు.
బియ్యం అపమృత్యు దోషాలు తొలగిపోతాయి, యజ్ఞాలు చేస్తే వచ్చే పుణ్యం ప్రాప్తిస్తుంది.
ఆవునెయ్యి అశ్వమేథయాగం చేసిన పుణ్యం లభిస్తుంది, విష్ణు సాయుజ్యం పొందుతారు. పితృదేవతలకు వదిలినవారికి దారిద్ర్య బాధ ఉండదు.
అన్నదానం విశేష ఫలితం పొందుతారు, సమస్త దేవతల ఆశీస్సులు పొందుతారు, సర్వధర్మాలను ఆచరించిన ఫలితం పొందుతారు.
పెరుగు అన్నం చేసిన కర్మలు తొలగి పుణ్యం లభిస్తుంది.
ఇక మొదటిసారిగా మామిడి పండ్లను ఎవరికైనా దానం చేసిన తరువాతనే వాటిని రుచి చూడటం చేస్తుంటారు. కొంతమంది ముందుగా మామిడి పండ్లను ఆలయంలో సమర్పించి .. బ్రాహ్మణులకు దానం చేసి ఆ తరువాతనే తాము తీసుకుంటారు. ఈ విధంగా వైశాఖ మాసంలో మామిడి పండ్లను దానం చేయడం వలన, పూర్వీకులకు పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందని చెబుతారు. అంతేకాదు ఇలా మామిడి పండ్లను దానం చేసినవారికి ఆ పుణ్యఫల విశేషం కారణంగా ఉత్తమ గతులు కలుగుతాయని అంటారు.